KTR | హైదరాబాద్ : మాజీ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తండ్రి బండ శ్రీహరి తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో బాగ్‌లింగంపల్లిలోని బీఎస్ ప్రసాద్ ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం వెళ్లారు. బండ శ్రీహరి పార్థివదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. బీఎస్ ప్రసాద్‌తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కేటీఆర్. బండ శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.
మాజీ అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ గారి తండ్రి బండ శ్రీహరి గారు పరమపదించగా.. బాగ్ లింగంపల్లిలోని బి.ఎస్. ప్రసాద్ గారి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు పరామర్శించారు.
శ్రీహరి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని… pic.twitter.com/HyiKXDdFCR
— BRS Party (@BRSparty) August 12, 2024