హైదరాబాద్,డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సోనియా బర్త్‌డే అధికారికంగా జరపడం కోసం తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియాగాంధీని ఒకప్పుడు బలిదేవత అని.. ఇప్పుడు బర్త్‌డే జరుపుతా అంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో ‘ఇదీ అసలు ముచ్చట’ అంటూ రేవంత్‌రెడ్డి తీరుపై సెటైరికల్ ట్వీట్ చేశారు.
ఇదీ అసలు ముచ్చట..!!
ఏటా డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుతారట..!రేవంత్..
సోనియా బర్త్ డేను అధికారికంగా.. జరపడం కోసమా.. ఈ తతంగమంతా..!!
మీ కాంగ్రెస్ తల్లి బర్త్ డే కోసం..మా తెలంగాణ తల్లిని బలిచేస్తావా..!!
అంత అభిమానం ఉంటే..మీ గాంధీ భవన్లో జరుపుకో..లేదా ఢిల్లీ వెళ్లి 10 జన్‌పథ్‌లో చేసుకో..అంతే కానీ..మీ పార్టీ జరుపుకోవాల్సిన బర్త్ డే ఫంక్షన్నుతెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దుతావా??
ఒకప్పుడు బలిదేవత అన్నవ్..ఇప్పుడు బర్త్ డే జరుపుతా అంటున్నవ్..నీ నాలుకకు నరం ఉండకపోవచ్చు..కానీ.. తెలంగాణ
ప్రజలకు ఆత్మగౌరవం ఉంది..పార్టీలు మార్చినంత ఈజీగా..విగ్రహాల రూపురేఖలు మార్చవచ్చని..అనుకోవడం నీ మూర్ఖత్వం తెలంగాణ తల్లి దివ్య స్వరూపాన్ని కోట్లాది గుండెల నుంచి చెరిపేయొచ్చని అనుకోవడం నీ అమాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ తల్లి