KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ.. మరో నిండు ప్రాణాన్ని కాపాడింది. సౌదీలో రోడ్డు ప్రమాదంలో రోడ్డున పడ్డ మంద మహేశ్‌కు వైద్యం అందించి క్షేమంగా స్వదేశానికి రప్పించారు కేటీఆర్. మంద మహేశ్ క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకోవడంతో.. అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు తనతో పాటు ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందగా మంద మహేశ్ ఒక్కడే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. సెల్పీ వీడియో ద్వారా తనను స్వదేశానికి తీసుకెళ్ళాలని కేటీఆర్‌ను మహేశ్ వేడుకోగా.. అతనికి ధైర్యం చెప్పి, ఆదుకుంటానని భరోసానిచ్చారు. కేటీఆర్ చొరవతో మహేశ్‌కు ట్రీట్మెంట్ చేస్తామని అంగీకరిస్తూ సౌదీలోని ప్రభుత్వ ఆసుపత్రికి కిమ్స్ యాజమాన్యం లేఖ రాసింది. కేటీఆర్ చెప్పినట్లుగానే సౌదీ దవాఖాన నుంచి నేడు స్వదేశానికి చేరుకున్నాడు మహేష్.