న్యూఢిల్లీ : ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవలు బుధవారం ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. లక్షలాది మంది యూజర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినట్టు ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యూట్యూబ్ సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది. ముఖ్యంగా మొబైల్ యాప్‌లో సమస్యలు తలెత్తాయని, వెబ్సైట్ మాత్రం పనిచేసిందని వివరించింది.
యూట్యూబ్ పనిచేయట్లేదని ఒక్క అమెరికాలోనే 2.8 లక్షల మంది యూజర్ల నుంచి ఫిర్యాదులు అందినట్టు పేర్కొన్నది. ఉదయం ఏడు గంటల సమయానికి భారత్‌లో 18 వేల ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. ఇందులో 71 శాతం మంది యూట్యూబ్ యాప్ వర్క్ చేయట్లేదని ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నది. రికమెండేషన్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వల్లే సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్టు యూట్యూబ్ వెల్లడించింది.