KTR | హైదరాబాద్ : ఈ ముఖ్యమంత్రి భరతం పట్టే పనిని కొండగల్ నుంచే మొదలు పెడతాం.. మా పార్టీ వాళ్లందరం కొడంగల్ వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. ఆయననేమైనా టెర్రరిస్టా? నరేందర్ రెడ్డి భార్యకు పోలీసులు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కోర్టులో ఈ దుర్మార్గాలపై పోరాటం చేస్తాం. రైతులకు అండగా ఉంటాం. మీ ఆనాలోచిత నిర్ణయాలను మానుకోండి. ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఫార్మా సిటీ విషయంలో వీళ్లు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు. బయట ఫార్మా సిటీ రద్దు అంటున్నారు. కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూములను వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు. ఫార్మా సిటీ పేరుతో ఫోర్త్ సిటీ, స్కిల్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు. అవసరం లేని చోట కూడా భూములు కొని రోడ్లు వేస్తూ ఇన్ సైడర్ ట్రేడింగ్ చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కంపెనీల బాగోతాన్ని ధారావాహిక మాదిరిగా బయటపెడుతూనే ఉంటాం. ఫార్మా విలేజ్ పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసే నిర్ణయాన్ని మానుకోండి. ఫార్మా సిటీ కోసం రైతులు ఇచ్చిన భూమిని వారికి తిరిగి ఇస్తామని మాట ఇచ్చారు. ఎప్పుడు ఇస్తారో తేదీ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | అల్లుడి కంపెనీ కోసం.. రైతులపై రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు..! కేటీఆర్ ధ్వజం
KTR | ముందుచూపుతోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ : కేటీఆర్