KTR | హైదరాబాద్ : అప్పుల లెక్కలు కాదు.. హామీల లెక్కలు చెప్పు.. వడ్డీల ముచ్చట్లు కాదు.. వాగ్దానాల ముచ్చట్లు చెప్పు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పులపై కారుకూతలు కాదు.. దమ్ముంటే నీ అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయ్ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణలో ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పులు కొత్తగా చేశారు. రాష్ట్రం అధోగతి పాలైంది.. ప్రజలు తిప్పలపాలయ్యారు. రేవంత్ బ్రదర్సేమో కోట్లకు పడగలెత్తారు. రేవంత్ పాలన అంటే గుర్తుకొచ్చేది లక్ష కోట్ల అప్పులు, దారుణ ఘాతుకాలు, తప్పులు. ఈ ఏడాదిలో ఏం సాధించావు అంటే సమాధానం లేదు. ఆర్భాటం ,హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ అప్పులు అంటూ తప్పుడు కూతలు కూస్తున్నాడు. అప్పుల మీద కాదు.. నీ తప్పుల మీద చర్చ జరగాలి. ఇవాళ సూటిగా అడుగుతున్నాం దమ్ముంటే సమాధానం చెప్పు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి దిగజార్చావు. నీ ప్రభుత్వంలో మీ బ్రదర్స్ బాగుపడ్డారు. వారికి లాభం జరిగింది. రాష్ట్రానికి వెయ్యి కోట్ల పెట్టుబడులు ఇచ్చే స్థాయికి అనుముల బ్రదర్స్ ఎదిగారని ప్రజలు అనుకుంటున్నారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్ ఎవరంటే అనుముల బ్రదర్స్ అని వస్తదమో.. అదానీని కూడా దాటేస్తారేమో అని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు. సంపద పెంచే సోయి లేదు. పాజిటివ్ పని చేసిన ముఖం లేదు. తెల్లారి లేస్తే కాకి కూతలు.. కేసీఆర్ మీద తిట్టు.. దేవుళ్ల మీద ఒట్లు.. ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచావు. రాష్ట్ర ప్రతిష్ట పెంచాల్సింది పోయి.. దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపణలు చేసిన దివాళాకోరు సీఎంవి నీవు. కొత్త పరిశ్రమలు కాదు.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టుకున్నాడు.. తెలంగాణ రైజింగ్ అని అంటున్నడు. అనుముల బ్రదర్స్ రైజింగ్ అని పెట్టుకోవాలి. తెలంగాణ మాత్రం ఫాలింగ్ అని చెప్పాలి. పన్నెండు పాలన మొత్తం అసత్యాలు, అటెన్షన్ డైవర్షన్ స్కీంలు తప్ప ఏం పీకారు. అబద్దాల కోరుగా తయారై మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నావ్. ఆరు గ్యారెంటీల మీద చర్చ జరగొద్దని.. అప్పులు అంటూ కారుకూతలు కూస్తున్నావంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
KTR | సింహాల్లా పోరాడుతున్న మా కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు : కేటీఆర్
Maharastra Govt | ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్కు మహాయుతి నేతల వినతి
PSLV-C59: ప్రోబా3లో సాంకేతిక లోపం.. పీఎస్ఎల్వీ సీ59 ప్రయోగం రేపటికి వాయిదా