Maharastra Govt | ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు మహాయుతి నేతల వినతి
Maharastra Govt | మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 11 రోజులైనా సీఎం ఎంపికపై పీటముడి వీడకపోవడంతో సస్పెన్స్ కొనసాగింది. చివరకు సీఎం ఎంపికపై మహాయుతి కూటమిలోని మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
Maharastra Govt : మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 11 రోజులైనా సీఎం ఎంపికపై పీటముడి వీడకపోవడంతో సస్పెన్స్ కొనసాగింది. చివరకు సీఎం ఎంపికపై మహాయుతి కూటమిలోని మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బుధవారం ఉదయం బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై దేవేంద్ర ఫడ్నవీస్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంది.
మధ్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్.. కూటమిలోని శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్‌లతో కలిసి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తమను ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానించాలని కోరారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం ఉన్నదని చెప్పారు. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు (నవంబర్ 4న) సాయంత్రం దక్షిణ ముంబైలోని అజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఆయనతోపాటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరూ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు హాజరుకానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

