KTR | హైదరాబాద్ : ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అరపైసా కూడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో చర్చించేందుకు నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఆయనకు ఉన్న అవగాహన, ఆయనకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో ఇందులో ఏదో కుంభకోణం జరిగింది అని అనుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగనే కనబడ్డట్టు.. రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నింట్లో కూడా దొంగతనం జరుగుతది.. అన్నింట్లో పైసలు తింటరనే దిక్కుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ.. నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు. నేను మళ్లీ చెబుతున్నా. రేవంత్ రెడ్డి గారు మీరు రేపు రండి.. లేదంటే మీరు మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు రమ్మంటే వస్తా. ఇద్దరం కూర్చుందాం.. నువ్వు లై డిటెక్టర్ పెట్టు. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టుండ్రి. నేను మాట్లాడుతా.. నువ్వు మాట్లాడు. ఎవడు దొంగనో.. ఎవడు దొరనో.. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు చూస్తరు. తేల్చుకుందాం.. పాపం ఈ బంద్ కెమెరాల్లల అధికారులను చంపుడు.. వాళ్లను సతాయించుడు ఎందుకు.. నువ్వు లైడిటెక్టర్ పరీక్ష పెట్టు.. తప్పకుండా వస్తాను అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డికి ఒక్కటే చెబుతున్నా.. ఈ దొంగ కేసులు, లొట్టపీస్ కేసులు నిలవవు. నీకు దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్ష పెట్టు.. నువ్వు రా.. నేను వస్తా. ఇద్దరం కూర్చుందాం.. రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ అనేది చూద్దాం. ఇక ఏసీబీ అధికారులు అడిగిందే అడిగిండ్రు.. పాడిందే పాటరా అని ఓ పాత సామెత ఉంది కదా.. గంతే తప్ప అందులో ఏం లేదు.. విషయం లేదు.. మన్ను లేదు. వాళ్లు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తా.. మళ్లీ విచారణకు రావాలని వారేమీ చెప్పలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | మీడియాతో మాట్లాడితే భయమెందుకు..? డీసీపీని ప్రశ్నించిన కేటీఆర్
KTR | నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు.. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్