హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ) : ‘నువ్వు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగ పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించా రు. సీఎంగానే కాకుండా హోం మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ కనీస సోయి లేకుండా బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంపై కేటీఆర్ భగ్గుమన్నారు.
పదేండ్ల కాలంలో లా అండ్ ఆర్డర్ నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ లో, నేడు అరాచకపర్వానికి ద్వారాలు తె రిచేవారు అధికారంలో ఉండటం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ ఆదివారం పకటన విడుదల చేశారు. తె లంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా పై ఉన్న చెకుచెదరని అభిమానాన్ని చూసి ముఖ్యమంత్రికి మైండ్‌బ్లాంక్ అ య్యిందని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఖమ్మం సభ సాక్షిగా తేలిపోయిందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే అరెస్టులు చేసే పోలీసు శాఖ, డీజీపీ.. సీఎం చేసిన ఈ తీవ్రమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మునిగిపోయే నావ అని తెలిసే..
కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రేవంత్ తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని కేటీఆర్ తెలిపారు. రెండేండ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకే తెలంగాణకు తీరని నష్టం చేసేలా జల హకులను రే వంత్ కాలరాశారని, ఇవాళ ఆయన చేసి న ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని విమర్శించారు. కాంగ్రెస్ ఒక ము నిగిపోయే నావ అని అర్థం కావడంతోనే, రేవంత్ ఏ క్షణమైనా బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ను రాజకీయం గా ఎదురోలేక.. బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ, మరోవైపు తెలంగా ణ ప్రజలు తిరసరించిన టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్ పన్నాగం పన్నుతున్నారని, దీనిని తెలంగాణ సమా జం తప్పకుండా తిప్పికొడుతుందని హె చ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి సీఎం రేవంత్‌రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.