హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ బడిపిల్లలకు బుకెడు బువ్వపెట్టడంలో లేదా? అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రజలను వేధించే పాలన అని ఎద్దేవాచేశారు. అమృత్ సీంను అప్పనంగా బామ్మర్దికి కట్టబెట్టడంలో ఉన్న తెలివి పసిపిల్లల కడుపు నింపడంలో లేదా? అని శుక్రవారం ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. ‘అదానీకి రాష్ట్రంలోని వనరులను దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలల దీనస్థితిపై లేదా? మూసీ ప్రక్షాళన పేరుతో మూటలు కట్టి ఢిల్లీకి కట్టలు పంపడంపై ఉన్న ప్రేమ.. భవిష్యత్తు భారతావని పసిపిల్లల ఆకలి కేకలపై లేదా?’ అని నిలదీశారు. ‘మంత్రుల సంగతి దేవుడెరుగు.. ముఖ్యమంత్రి ఇలాకాలోనే బడి పిల్లలు పస్తులుండే దుస్థితి దాపురించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బాసులు, గల్లీ దోస్తుల ఆకలి తీర్చడమే కాదు.. మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. ‘ఫొటోలకు పోజులిచ్చి ఒక్కపూటకు గప్పాలు కొట్ట డంకాదు.. నిత్యం విద్యా ర్థులకు సకాలంలో అన్న ం అందుతున్నదో లేదో సమీక్షించుకోవాలి’ అని సూచించారు.
పల్లె మళ్లీ కన్నీరు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రుణమాఫీని ఆగంచేసి పెట్టుబడి సాయానికి మాయం చేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతు ఆత్మహత్యలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతులపాలిట శాపంగా మారిందని, చలనం లేని సీఎం, బాధ్యత లేని సరారు వల్లే తెలంగాణ పల్లె మళ్లీ కన్నీరు పెడుతున్నదని, రైతుల మరణమృదంగం మళ్లీ మోగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కార్‌కు చేతనైతే సాగు సంక్షోభాన్ని ఆపి అన్నదాతల ఆత్మహత్యలను నిలువరించాలని డిమాండ్ చేశారు. ‘420 అబద్ధపు హామీల పాపం..420 రోజుల చేతకాని పాలన శాపం.. ఫలితంగా మాటలకందని మహావిషాదం. తెలంగాణ చెల్లించిన భారీ మూల్యం.. 420 మంది రైతన్నల బలవన్మరణం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్థులు అధికార పీఠమెకి అన్నదాతలను బలిపీఠం ఎకిస్తున్నారని విమర్శించారు. దేశానికే వెన్నెముకైన రైతులకు కాంగ్రెస్ పాలనలో వరుస వెన్నుపోట్లు అని మండిపడ్డారు. పదేండ్లలో పంజాబ్‌నే తలదన్నే స్థాయికి చేరిన తెలంగాణ రైతన్నకు ఇప్పుడు పెట్టుబడి ఎండమావిగా మారిందని వాపోయారు.