KTR | రాజన్న సిరిసిల్ల : అసమర్ధ కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన రైతు స్వర్గీయ జెల్ల దేవయ్య కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధైర్యం చెప్పారు.
కాళేశ్వరంపై కుట్రలు చేసి రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టి ఆకుపచ్చని తెలంగాణను హస్తం ఆగం చేసింది. కాంగ్రెస్ పాలనలో చేను తడిపేందుకు చెలిమ నీళ్లు దిక్కయింది. బిందు సేద్యం పోయి చివరికి బిందె సేద్యం చేసే పరిస్థితి తీసుకు వచ్చింది అని కేటీఆర్ విమర్శించారు. సాగునీళ్లు లేక, సాగు కొనసాగించలేక, అప్పుల పాలై ఆందోళనకు గురై అన్నదాతలకు ఆత్మహత్యలతో వెనకటి రోజులు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ మండిపడ్డారు. జలధారలు పారిన నేలలో కర్షకుల కన్నీటి ధారలు పారుతుంటే చూసి తట్టుకోలేక, అన్నదాతకు అండగా బాధిత కుటుంబాలకు భరోసాగా నేనున్నానని కేటీఆర్ అభయం ఇచ్చారు.
అసమర్ధ కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన రైతు స్వర్గీయ జెల్ల దేవయ్య గారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కాళేశ్వరంపై కుట్రలు చేసి రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టి… pic.twitter.com/dCXOv01YXw
— BRS Party (@BRSparty) March 5, 2025