యాదిరెడ్డి త్యాగానికి వెలకట్టలేం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మబలిదానం చేసుకున్న యాదిరెడ్డి త్యాగానికి వెలకట్టలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
- తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత కాలం వారి కుటుంబానికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటం
- సోదరుడి కూతురుకు వైద్య ఖర్చులు అందిస్తం
- యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మొయినాబాద్, జూన్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో ఆత్మబలిదానం చేసుకున్న యాదిరెడ్డి త్యాగానికి వెలకట్టలేమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం అసువులుబాసినవారి కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం గ్రామానికి చెందిన యాదిరెడ్డి కుటుంబాన్ని ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు. తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. యాదిరెడ్డి చిత్ర పటంపై పూలు వేసి నివాళులర్పించారు. తన మనుమరాలికి గొంతు సమస్య ఉన్నదని, ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారని చంద్రమ్మ వివరించగా వైద్య ఖర్చులను పార్టీ తరఫున అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి దృష్టికి తేవాలని ఆమె ఫోన్ నంబర్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదిరెడ్డి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 500 గజాల ఇంటి స్థలం కూడా ఇచ్చిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

