హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ‘భూముల అమ్మకాల్లో బీజీగా ఉన్న రేవంత్ సర్కారు.. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటును మరిచిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నమ్మిన పాపానికి రైతులకు శ్మశానమే దిక్కయ్యింది..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోమలగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంతో 15 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల రైతులు శ్మశానంలో వడ్లకుప్పలపై నిద్రించాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం ఆయన ‘ఎక్స్’లో అన్నదాతల దయనీయస్థితిపై ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేస్తూ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కారు నిర్లిప్త వైఖరిని ఎండగట్టారు. బతికుండగానే రైతులను వల్లకాడుకు చేర్చిన పాపం కాంగ్రెస్‌ను వెంటాడటం ఖాయమని హెచ్చరించారు.