హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ‘చేయి చేయి కలుపుదాం.. అరుదైన జన్యువ్యాధితో బాధపడుతున్న చిన్నారికి అండగా నిలుద్దాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మంగళవారం పిలుపునిచ్చారు. సత్యవేద్ అనే తొమ్మిది నెలల చిన్నారి అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2తో బాధపడుతున్నదని పేర్కొన్నారు.
ఆ చిన్నారి చికిత్స కోసం రూ.9 కోట్లకు పైగా అవసరమని వైద్యులు తెలిపినట్టు పేర్కొన్నారు. పాప సత్యవేద్కు అందరం అండగా నిలుద్దామని కోరుతూ, తన పోస్ట్‌కు చిన్నారి ఫొటోనూ ట్యాగ్చేసి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తిచేశారు.