KTR | కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తుక్కుగూడలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుక్కుగూడ చౌరస్తాలో పార్టీ జెండాను కేటీఆర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
మరికాసేపట్లో ఆమన్‌గల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు దీక్షలో కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ సర్కార్‌ను ఎండగడుతూ.. రైతులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. రైతు దీక్షకు భారీగా రైతులు తరలివచ్చారు. జై కేసీఆర్.. జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోతోంది.
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారికి తుక్కుగూడలో ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
తుక్కుగూడ చౌరస్తాలో పార్టీ జెండాను ఎగురవేసిన కేటీఆర్, మాజీ మంత్రి… pic.twitter.com/2jOrrysb3p
— BRS Party (@BRSparty) February 18, 2025