KTR | సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రథోత్సవం కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వేలాది సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని తాడు లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు పేద మంత్రాల మధ్య కేటీఆర్ కు ఆశీర్వచనం అందజేశారు. జాతరలు పాల్గొన్న యువత కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.