KTR | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. గోపన్న ఆశయ సాధనకు మీ ముందుకు వస్తున్న మాగంటి సునీత కారు గుర్తుకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి అని కేటీఆర్ కోరారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుద్దాం.. ఈ అసమర్ధ, అవినీతి కాంగ్రెస్ను ఓడిద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ నెల 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరపున గోపినాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది. ఇక ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని పలు సర్వేలు కూడా వెల్లడించాయి.
గోపన్న ఆశయ సాధనకు మీ ముందుకు వస్తున్న మాగంటి సునీత గారి కారు గుర్తుకు మీ ఓటు వేసి ఆశీర్వదించండి 🙏
కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడుద్దాం.
ఈ అసమర్ధ, అవినీతి కాంగ్రెస్ను ఓడిద్దాం.#VoteForCar#JubileeHillsWithBRS pic.twitter.com/ilOuIiV3Df— KTR (@KTRBRS) November 9, 2025