KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పనులు ఆలస్యంపై రేవంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సేవ కంటే రాజకీయాలు, ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తోందంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం వల్లే కొత్వాల్‌గూడ ఎకో పార్కు పనులు నిలిచిపోయాయన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రెండేండ్ల క్రితమే మెజార్టీ భాగం పనులను పూర్తి చేసింది. అయినా ఈరోజు వరకు పార్క్ ప్రారంభం కాని దుస్థితి. కొత్వాల్‌గూడ ఎకో పార్క్.. హైదరాబాదీల కోసం నిర్మించిన అంతర్జాతీయ స్థాయి పార్క్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అసమర్థత, నిర్లక్ష్యం ప్రధాన లక్షణాలుగా మారాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, అభివృద్ధి పనులు పక్కనపెట్టి ప్రచార యాత్రలకే ప్రాధాన్యత ఇస్తుస్తోంది. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచే ఈ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అశక్తతతో నిలిచిపోయింది. ఇది నిస్సహాయ ప్రభుత్వం, నిస్సహాయ పాలన అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
13 months ago, I had flagged the slow pace of Kothwalguda Eco Park works.
BRS Govt had already completed majority works of this project about two years ago, yet even today it remains unopened.
Revanth Reddy Govt is only obsessed with politics & propaganda, not public service.… https://t.co/z89kORARb1
— KTR (@KTRBRS) August 13, 2025