BRS workers : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగియగా.. ప్రస్తుతం రెండో, మూడో విడత ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే పర్యటన పేరుతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కడియం సారూ.. మనది ఏ పార్టీ..? కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి..?’ అని రాసిపెట్టి ఉన్న ప్లకార్డులతో నిరసనకు దిగారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకున్న కడియం శ్రీహరి
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామంలో ప్రచారానికి కడియం శ్రీహరి వస్తున్నాడని, బీఆర్ఎస్ కార్యకర్తల ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు
దీంతో కడియం సారు మనది ఏ పార్టీ అంటూ,… pic.twitter.com/LUhWfchBIB
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2025