కరీమాబాద్, సెప్టెంబర్ 3 : సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు వరంగల్ నగరంలోని బీఆర్ఎస్ కార్యకర్త బాబుమియాను అరెస్టు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన ‘ఎవరు నంది.. ఎవరు పంది’ అనే కామెంట్లపై.. ‘నంది ఫొటోతో కేసీఆర్, పంది ఫొటోతో రేవంత్‌రెడ్డి’ని పెట్టి సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిసింది.
కాగా బాబుమియా కన్పించడం లేదని కుటుంబ సభ్యులు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు నేపథ్యంలో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.