హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత పదేండ్లలో వ్యక్తిగతంగా, మంత్రిగా వేల మందికి అనేక సందర్భాల్లో తనకు తోచిన సాయం, సహకారం అందించారు. ఈ నేపథ్యంలో కొందరు రాఖీ పండుగను పురస్కరించుకొని సోమవా రం బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేటీఆర్ నివాసానికి వచ్చి మరీ రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకున్నారు. జగిత్యాలకు చెందిన అనాథ వి ద్యార్థిని రుద్రరచన ఇంజినీరింగ్ సీ టు సాధించింది. ఆమె ఆర్థిక ఇబ్బందులను తెలుసుకొని చదువు కోసం కేటీఆర్ పూర్తి ఖర్చులు భరించారు. ప్రస్తుతం ఆమె కాగ్నిజెంట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నది. కేటీఆర్ చేసి న సాయానికి కృతజ్ఞతగా గతేడాది ఆమె తన 3 నెలల జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. ఈసారి ఆమె కేటీఆర్‌ను కలిసి రాఖీకట్టి తన ప్రేమను చాటుకున్నది.
మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ప ద్మాదేవేందర్‌రెడ్డి, హరిప్రియానాయ క్, తుల ఉమ, గండ్ర జ్యోతి, గుజ్జ దీపిక, ముక్తవరం సుశీలారెడ్డి, ము న్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేటర్లు, కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ప్రతి సోదరికి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, తన సోదరి కవిత రాఖీ కట్టే పరిస్థితి లేకపోవటంపై ఆవేదన చెందారు.
రాఖీ పండుగ సందర్భంగా తన సోదరి కవితను తలచుకుంటూ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఈ రోజు నువ్వు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ, నీకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉంటా’ అని పేర్కొంటూ గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫొటోను, కవిత పిడికిలి ఎత్తిన ఫొటోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు మహిళలు పెద్దసంఖ్యలో వచ్చి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు ధన్యవాదాలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల బంధానికి రాఖీ పండుగ ప్రతీక అని, ప్రేమాభిమానాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళల శ్రేయస్సు, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.