హైడ్రామాకు ఫుల్స్టాప్ పెట్టండి.. పోక్సో కేసు నిందితుడు తప్పించుకు తిరుగుతుంటే పోలీసులేం చేస్తున్నరు?
పోక్సో కేసులో అరెస్ట్ కావాల్సిన నిందితుడు బండి భగీరథ్ తప్పించుకు తిరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రశ్నించారు. ఇన్ని రోజులైనా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని, రాష్ట్రంలో సామాన్యులకు ఒక న్యాయం, మంత్రి కొడుకుకు మరో న్యాయమా అని నిలదీశారు.
- రాష్ట్రంలో సామాన్యులకు ఒక న్యాయం, మంత్రి కొడుకుకు ఒక న్యాయమా?
- కొడుకును బండి వెంటనే అప్పగించాలి
- డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : పోక్సో కేసులో అరెస్ట్ కావాల్సిన నిందితుడు బండి భగీరథ్ తప్పించుకు తిరుగుతుంటే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రశ్నించారు. ఇన్ని రోజులైనా అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని, రాష్ట్రంలో సామాన్యులకు ఒక న్యాయం, మంత్రి కొడుకుకు మరో న్యాయమా అని నిలదీశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ సీవీ ఆనంద్‌ను వారు కలిసి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి హైడ్రామాకు ఫుల్స్టాప్ పెట్టాలని వారు కోరారు. మా జీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మహిళా నాయకులు సామల హేమ, సు నీత, నిరోష, బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి తదితరులు డీజీపీకి ఏడు డిమాండ్లతో కూడిన నాలుగు పేజీల వినతిపత్రం సమర్పించారు. అనంతరం కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో వారు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రేవంత్ ఫెయిల్: సత్యవతి రాథోడ్
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, హోం మంత్రి గా పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. స్టేషన్ బెయి ల్ వచ్చేలా నిందితుడిపై బలహీనమైన సెక్షన్లు పెట్టి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీని సపోర్ట్ చేస్తున్నదని, అందుకే పోలీసులపై ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉన్నట్టు తాము భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తున్నదని, పోక్సో కేసుపై కాంగ్రెస్ మహిళా మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన తప్పుని ఒప్పుకొని తన కొడుకుని వెంటనే సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు.
తప్పించాలని చూస్తున్నరు: తుల ఉమ
బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొడుకుని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ వి మర్శించారు. నిందితుడిని కాపాడటం కూడా నేరమేనని, అందుకే ఈ కేసులో సంజయ్‌ను కూడా నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశా రు. సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిందితుడి మేనమామకు నోటీసులు ఇచ్చారని, పోలీసుల ఎదుట లొంగిపోవాలని నోటీసులో పేరొన్నారని గుర్తుచేశారు.
మంత్రులు మాట్లాడరా?: గొంగిడి సునీత
రాష్ట్రంలో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా కాంగ్రెస్ మహిళా మంత్రులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మండిపడ్డారు. గతంలో చిన్నచిన్న విషయాలకే స్పందించిన మంత్రి సీతక, ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరూ కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడు పరారీలో ఉంటే అతని బంధువులను ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదని సునీత ప్రశ్నించారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

