KTR | తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 90-100 వంద సీట్లతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే.. ఈ సన్నాసులు ఎంత ప్రయత్నం చేసినా.. ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా.. ఎన్ని రకాల పచ్చి అబద్ధాలను మార్కెట్లో మార్కెటింగ్ చేసినా.. ఊరంతా హోర్డింగ్‌లు పెట్టి ఊదరగొట్టినా ఒకటి మాత్రం జరుగబోయేది పక్కా. రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా ఘంటాపథంగా చెబుతున్నా.. 90-100 సీట్లతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం ఖాయం. నేను మీ అందరికీ మాట ఇస్తున్న. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటిరోజే.. మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్‌కు పంపడం ఖాయం’ అన్నారు.
అని నమ్మబలుకుతున్నరో.. ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ.. అభయహస్తం అని చెప్పి మోసం చేసి ప్రయత్నం చేస్తున్నరో.. ఏ కాంగ్రెస్ తల్లి అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. ఆరు గ్యారంటీలు అని.. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభ పడేలా చేస్తున్నదో.. ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీభవన్‌కు పంపడమే ఖాయం ఖాయం. ఇది రాసిపెట్టుకో రేవంత్‌రెడ్డి అని చెబుతున్న. ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్నాసో.. చరిత్ర తెలియని మూర్ఖుడో.. చరిత్రను మారుస్తా అని అనుకుంటే వాళ్ల అవివేకమవుతుంది. కానీ, మనం జాగ్రత్తగా ఉండకపోతే.. అప్రమత్తంగా ఉండాలి. సింహాలు తమగాథ తాము చెప్పుకోకపోతే.. వేటగాళ్లు చెప్పే పిట్టకథలే చరిత్రగా మారుతయని పెద్దలు చెబుతారు. వేటగాళ్ల కూర్రమైన పరిహాసం.. ఎవరైతే తెలంగాణలో పేదబిక్కితో ఆడుతున్నరో.. కాంగ్రెస్ సన్నాసులు చెప్పే మాటలు నిజం కావొద్దంటే.. ఎప్పటికప్పుడు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని మేడ్చల్‌లో మా తమ్ముడు రాజు.. వివేక్ శ్రమ తీసుకొని మిమ్మల్ని అందరికీ ఒకచోటకు తెచ్చి శోభాయమానంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని. అదే పద్ధతుల్లో రాష్ట్రమంతా కార్యక్రమాలు చేద్దాం’ కేటీఆర్ పిలుపునిచ్చారు.