Exit Polls | బీఆర్ఎస్దే విజయం.. సీపీఎస్ ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి
Exit Polls | తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ 72కి పైగా స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించాయి.
Exit Polls | తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ 72కి పైగా స్థానాల్లో గెలుస్తుందని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (సీపీఎస్) ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. 43 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ వెంట ఉన్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినప్పటికీ.. 36(+or-5) స్థానాలకే పరిమితం కానుంది. ఇక బీజేపీ 1 నుంచి 3 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇతరులు 9 మంది వరకు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని సీపీఎస్ పేర్కొంది. 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని తెలిపింది. 29 నియోజకవర్గాల్లో 3000 కంటే తక్కువ మెజారిటీతోనే బీఆర్ఎస్ గెలుస్తుందని పేర్కొంది. అలాగే కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ గెలుస్తారని తెలిపింది. ఇక కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తారని తెలిపింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గట్టి పోటీ ఎదుర్కొంటారని పేర్కొంది.
బీఆర్ఎస్ పార్టీ 68కి పైగా సీట్లలో గెలవబోతుందని పొలిటికల్ గ్రాఫ్ వెల్లడించింది. కాంగ్రెస్‌కు 38, బీజేపీకి 5, ఇతరులు 8 స్థానాల్లో గెలుస్తారని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ 61 -68 స్థానాల్లో గెలుస్తుందని థర్డ్ విజన్ నాగన్న ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. కాంగ్రెస్ 34-40, బీజేపీ 3-5, ఇతరులు 5-8 స్థానాల్లో గెలవబోతున్నారని పేర్కొంది. థర్డ్ విజన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ 60-68 స్థానాల్లో గెలవనుంది. కాంగ్రెస్ 33-40, బీజేపీ 1-4 స్థానాల్లో, ఇతరులు 0-1 శాతం గెలుస్తుందని పేర్కొంది.
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్
బీఆర్ఎస్ 56
కాంగ్రెస్ 48
బీజేపీ 10
ఎంఐఎం 5
పోల్ స్ట్రాట్
బీఆర్ఎస్ 48-58
కాంగ్రెస్ 49-59
బీజేపీ 05-10
ఎంఐఎం 06-08
శ్రీఆత్మసాక్షి
బీఆర్ఎస్ 58-63
కాంగ్రెస్ 48-51
బీజేపీ 7-8
ఇతరులు 7-9
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

