హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్న కాంగ్రెస్‌పై గులాబీ శ్రేణులు మండిపడ్డాయి. అసహ్యకర, అడ్డగోలు, ఫేక్ పోస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్స్టేషన్లలో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, సిరిసిల్ల సహా పలు జిల్లాల్లో ఫిర్యాదు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌పై దుష్ప్రచారాన్ని ఆపకపోతే దీటుగా సమాధానం చెప్తామని హెచ్చరించారు.