Minister Harish Rao | కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు.. కరెంటు కటకటలు.. కరువులు కర్ఫ్యూలేనని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్వాగత సభ, 16న సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కోసం నియోజకవర్గ స్థాయి సన్నాహక సదస్సులో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాధోడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు జనగామ అంటే ప్రేమ అన్నారు.
2001లోనే ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరినగడ్డ అని.. గులాబీ జెండా అడ్డ అన్నారు. జనగామలో గెలిచేది పక్కా గులాబీ జెండా అన్నారు. ఢిల్లీని కదిలించి.. కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు. రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో గులాబీ జెండా కప్పుకున్న ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. 2010లో తెలంగాణల ఉద్యమ సమయంలో పల్లా పరిచయమన్నారు. సీఎం మీటింగ్ లక్ష మందితో జరగాలన్నారు. కేసీఆర్ సభను కార్యకర్తలు ముందుండి నడపాలన్నారు. కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిలోపోసుకున్నా తక్కువేనన్నారు.
నిండు మనసుతో దీవించడమే బీఆర్ఎస్ క్రమశిక్షణ అని, కాంగ్రెస్ వారి మూటలు, మాటలు.. మటలు కుర్చీల కోసమేనన్నారు. కాంగ్రెస్‌కు 11 సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని అభివృద్ధిని 11 సంవత్సరాల్లోపే కేసీఆర్ అభివృద్ధి చేశాడన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కైలాసం నుంచి పెద్దపాము మింగితే కిందపడ్డట్టేనని.. 156 మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని, 16న జనగామ బహిరంగ సభకు హాజరవుతారన్నారు. కాంగ్రెస్‌వి అట్టి మాటలేనని.. బీఆర్ఎస్ చేతల ప్రభుత్వమన్నారు.
2009 మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోను తుంగలో తొక్కిందని, కేసీఆర్ మేనిఫెస్టోను పూర్తిగా అభివృద్ధి చేశారన్నారు. ఓట్లకోసం ఆలోచించడం కాదని.. పేదల కోసం ఆలోచించే నేత కేసీఆర్ అన్నారు. జనగామలో బీఆర్ఎస్ గెలుపు విషయంలో డౌటే లేదని.. భారీ మెజారిటీ రావాలన్నారు. సీఎం కేసీఆర్‌కు భారీ స్వాగతం పలకాలని, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలన్నారు. బీఆర్ఎస్లో బేధాభిప్రాయాలు లేవని.. అందరు ఒకటే అభివృద్ధి చేసుకున్నానన్నారు. అందరూ ముందుకు నడవాలని, అద్భుత విజయం సాధించాలన్నారు.