హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయల్దేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వాణీదేవీతోపాటు ఎమ్మెల్యేలు జీ జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయించింది. శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ను బీఆర్ఎస్ ప్రతినిధి బృం దం కలువనున్నది.
మహిళా ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ వంటి అత్యంత కీలకమైన ప్రాంగణంలో జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు కోరనున్నారు. ఘటనకు సంబంధించిన తమ వాదనలను కమిషన్ ముందు వివరించి, సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. మహి ళా కమిషన్‌తోపాటు జాతీయ మానవ హకుల కమిషన్‌ను కూడా బీఆర్ఎస్ ఎ మ్మెల్యేలు కలువనున్నారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై సమగ్రంగా విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకొనేలా జోక్యం చేసుకోవాలని జాతీ య మానవ హకుల కమిషన్‌ను కోరనున్నారు. ఢిల్లీ పర్యటనలో రెండు జాతీయ కమిషన్లకు తమ వద్ద ఉన్న ఆధారాలను అందించనున్నారు.