మహదేవపూర్(కాళేశ్వరం), ఆగస్టు 3: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు బీఆర్ఎస్ బృందం నేడు రానున్నది. సోమవారం ఉదయం 10గంటలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంప్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్ ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు జకు శ్రీహర్షిణి రాకేశ్, దావ వసంత సురేశ్, వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పాల్గొంటారని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.