హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు జూపల్లి, పొంగులేటిని సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.