RS Praveen Kumar | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రూ.32,000 ప్లేటు మీల్స్‌తో మంత్రులకు కడుపు నిండితే చాలా? నిరుద్యోగుల కుటుంబాలు ఆకలితో అలమటించినా పట్టించుకోరా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా? నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా సమయం లేదా? అని శనివారం ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డి సర్కారును నిలదీశారు.
‘అయ్యా.! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు.. దయచేసి కొంచెం ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వడానికి కొంచెం సమయాన్ని కేటాయించండి. జెన్కోలో ఇంజినీర్లు, కెమిస్టులుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాల కోసం మూడు నెలలుగా రోజూ చకోర పక్షుల్లా భిక్షాటన చేస్తున్నారు. వాళ్లేం పాపం చేసిండ్రు? ప్రజా ప్రభుత్వం మరీ ఇంత బిజీనా? నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా ముహూర్తాలు కావాలా?’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చురకలు అంటించారు.
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) ప్రమాదకారి కాదని డీపీహెచ్ రవీందర్ నాయక్ తెలిపారు. సాధారణ జలుబుతోపాటు శీతాకాలంలో వచ్చే ఇతర లక్షణాలు కలిగిస్తుందని, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా హెచ్ఎంపీవీ కేసులు నమోదు కాలేదని తెలిపారు.