ములుగు : ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఇటీవల మృతిని కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు .
కేటీఆర్ సమకూర్చిన ఐదు లక్షల రూపాయల విలువైన బాండ్లను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మహేష్ భార్య, పిల్లలకు మాధవరావు పల్లెలోని వారి స్వగృహంలో అందజేశారు.