ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐదు నెలల జీతం అందక ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మహేశ్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు సోమవారం భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు.