హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని అంటున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్‌కు రావాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. పీఏసీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ)చైర్మన్‌గా నియమితులైన గాంధీ వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే నియమించాలనే నిబంధనను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ.. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని నిసిగ్గుగా తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని పేర్కొనటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.