హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఈడీ దాడుల నుంచి విముక్తి కోసం బీజేపీ ముందు మోకరిల్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురిం చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు.
ఇటీవల పొం గులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసినప్పుడు ఏ హోటల్లో ఎవరి కాళ్లు పట్టుకుంటే వదిలేశారో గుర్తులేదా? అని ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని నడిబజారులో ఎండగుతున్నందుకే కేటీఆర్‌పై మంత్రులు నిందలేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు ఎంత గింజుకున్నా కేటీఆర్ నిరంతరం ప్రజల ముందు వారిని నిలదీస్తూనే ఉంటారని హెచ్చరించారు.