హైదరాబాద్ మార్చి 15 (నమస్తే తెలంగాణ): బూతులకు అడ్రస్‌గా పేరుగాంచిన సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చిల్లరగా మాట్లాడారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. హామీల అమలు చేతగాక సభలో అబద్ధాలు చెప్పారని ఎక్స్‌లో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు చేతగాని తనాన్ని బయటపెడుతున్న మీడియా ప్రతినిధులను ‘బట్టలిప్పి కొడ్తా, తోడ్కలు తీస్తా’ అని రౌడీలా బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌ను కుటుంబ సభ్యులు ఎర్రగడ్డ దవాఖానలో చూపించాలని సూచించారు.