బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసేందుకు మధ్యలోకి మహిళలను లాగుతున్నారని మండిపడింది.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు సంబంధం లేని మహిళలను లక్ష్యంగా చేసుకుని చౌకబారు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీనాక్షి నటరాజన్‌ను ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పలు ప్రశ్నలను సంధించింది.
To @RahulGandhi, @priyankagandhi, @MNatarajanINC
Congress leaders in Telangana are repeatedly dragging women, who have nothing to do with political life, into cheap and baseless political attacks.
It has unfortunately become a routine for your party leaders to resort to vile… pic.twitter.com/v7zkfKqvAk
— BRS Party (@BRSparty) April 29, 2026
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీజీటీఎస్ చైర్మన్, టీపీసీసీ సోషల్‌మీడియా చైర్మన్ మన్నె సతీశ్ చేసిన వ్యాఖ్యలను మహిళలను అవమానించేలా ఉన్నాయని బీఆర్ఎస్ పేర్కొంది. ప్రజా చర్చల స్థాయిని దిగజార్చే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించింది. ఇలాంటి ప్రవర్తనను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. అడ్డగోలు విమర్శలు చేసిన నాయకులపై చర్యలు తీసుకుంటారా? లేక మౌనం ద్వారా మద్దతు తెలుపుతున్నారా అని నిలదీసింది. దీనిపై తెలంగాణ ప్రజలు స్పష్టమైన సమాధానం కోరుతున్నారని పేర్కొంది.
ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది.