BRS | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన కేసు విషయంలో ఈడీకీ ఎందుకు అంత అత్యుత్సాహమని బీఆర్ఎస్ ప్రశ్నించింది. మూడు నెలల క్రితం పొంగులేటి ఇంటి మీద దాడులు చేసిన ఈడీ ఇంతవరకు ఆ వివరాలు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది. కాంగ్రెస్, బీజేపీలో తెలంగాణ మిత్రులుగా ఉంటూ.. ఢిల్లీలో శత్రువులుగా నాటకం ఆడుతున్నాయని విమర్శించింది.
తెలంగాణలో అదానీ పల్లకి మోసే రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు నోరు తెరవడని బీఆర్ఎస్ నిలదీసింది. జాతీయ స్థాయిలో అదానీ మీద పోరాడుతున్న రాహుల్ గాంధీ.. ఏడాదిలో తెలంగాణలోని రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల గురించి ఎందుకు ప్రశ్నించదని అడిగింది. ఎందుకు రద్దు చేయదని ప్రశ్నించింది. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మీద నియంత్రణ లేదా అని నిలదీసింది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రమే చేసుకున్న అంతర్గత ఒప్పందమా అని ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద శాసన సభలో కాంగ్రెస్ ఎందుకు చర్చకు అవకాశం ఇవ్వదని నిలదీసింది. దీనిపై తెలంగాణ ప్రశ్నిస్తున్నదని చెప్పింది.