నల్లగొండ ప్రతినిధి, జనవరి 11(నమస్తే తెలంగాణ) : నల్లగొండలో ఆదివారం తలపెట్టిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాను సంక్రాంతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
సంక్రాంతి తర్వాత మహాధర్నా జరుగుతుందని, కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తున్నదని, లగచర్ల, హైడ్రా, మూసీ వంటి అంశాల్లో ప్రజల పక్షాన కేటీఆర్ నిలబడి కొట్లాడడాన్ని సహించలేని రేవంత్‌రెడ్డి సర్కార్ కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నదని చెప్పారు.