హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసనమండలిలో డ్రగ్ టెస్ట్ చేయించుకొనేందుకు బీఆర్ఎస్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ సభ్యులు కూడా సిద్ధంకావాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్ కేసును సాకుగా చూపి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు.
చట్టపరిధిలో తేలాల్సిన వ్యవహారాన్ని కాంగ్రెస్ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో సహించలేక కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.