రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై మాట తప్పిన సర్కార్
అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఇచ్చి చేతులుదులుపుకుంటున్నది.
- టీచర్లకు లక్ష.. హెల్పర్లకు రూ. 50 వేల చెల్లింపు
- విడతలవారీగా విడుదల
- 2 లక్షలు ఇస్తామంటూ హామీ
- కాంగ్రెస్‌పై అంగన్వాడీ యూనియన్ల ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఇచ్చి చేతులుదులుపుకుంటున్నది. అది కూడా విడతల వారీగా అందిస్తున్నారని, నమ్మబలికి మోసం చేశారంటూ కాంగ్రెస్ సర్కార్‌పై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సాకుగా చూపుతూ ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి మొండిచెయ్యి చూపుతున్నదని అంగన్వాడీ యూనియన్ల నాయకులు మండిపడుతున్నారు. నాడు ఆర్థిక పరిస్థితి గురించి తెలియకుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ పొందినవారు సుమారు తొమ్మిది వేల మంది సిబ్బంది ఉండగా, ఇప్పటివరకు సగం మందికి కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలిస్తామని ఆశ జూపి, విరమణ వయస్సును కూడా తగ్గించి తమను నట్టేట ముంచారని మండిపడుతున్నారు.
నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ (మినీ) యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన మేరకే బెనిఫిట్స్ ఇవ్వడం.. అది కూడా విడతల వారీగా విడుదల చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయంపై అనేకసార్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, డైరెక్టర్‌ను కలిసి విన్నవించినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హామీ మేరకు సిబ్బందికి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వాలని, అదీ కూడా రిటైర్ అయిన నెలలోగా అందించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ఊరుకొనే ప్రసక్తేలేదని, ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

