Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
లక్ష్మాపూర్ గేటు వద్ద విద్యుత్ కోతలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు.
మెదక్ : మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గేటు వద్ద విద్యుత్ కోతలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి లోవోల్టేజ్ సమస్య ఉండడంతో వ్యవసాయ బోరు మోటర్లు కాలిపోతున్నాయని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలో వ్యవసాయానికి కనీసం 6 గంటల కరెంట్ సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వరి పంట పొట్ట దశలో ఉండడంతో నీరు లేక ఎండిపోతుందని తెలిపారు. కరెంట్ లేక నీళ్లు రాక పంటలు నష్టపోయి రైతులు అప్పుల పాలువున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు సరఫరా చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

