సీసీసీ నస్పూర్, డిసెంబర్ 8 : కాంగ్రెస్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం నస్పూర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టా రు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. అనంతరం దివాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీపీఎస్ అభ్యర్థిగా తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి పేరును యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రకటించారు. మార్చిలో జరుగనున్న ఎన్నికలకు సంబంధించి ఆదివారం యూనియన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. పెట్టుబడిదారి పెన్షన్ విధానాన్ని పారదోలేందుకు ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపినట్టు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్‌కుమార్, పోల శ్రీనివాస్, సభ్యులు మల్లికార్జున్, రాజేశ్, వనమాల, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.