Congress | రాష్ట్ర రాజధానిలో పట్టపగలు..మిట్ట మధ్యాహ్నం హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండామూకలు విధ్వంసం సృష్టించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తన అనుచరులతో కలిసి కూకట్పల్లి వివేకానందనగర్‌లోని నివాసం నుంచి కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి భారీ కాన్వాయ్‌తో 8 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లను దాటుకుని వెళ్లారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటి గేట్లు దుంకి చొచ్చుకెళ్లి రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం చేసి, పూలకుండీలను పగులకొట్టారు. పక్కా ప్రణాళికతో కర్రలు, కత్తులతో వీరంగం చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గృహనిర్భంధంలో ఉన్నా.. ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించినా ఎమ్మెల్యే గాంధీ, అనుచరుల గూండాగిరి మాత్రం ఆగలేదు. మాటల్లో చెప్పలేని బూతుపురాణంతో ఎమ్మెల్యే అరెకెపూడి గాంధీ చేసిన అరాచకం అంతాఇంతా కాదు. హుజురాబాద్ నుంచి నా నియోజకవర్గానికి బతుకొచ్చినవ్ కొడుకా.. అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చగొట్టారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుమారుడు పృథ్వీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే పక్కా ప్రణాళికతో దాడి చేశారు.
దాడి విషయాన్ని తెలుసుకుని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సబితారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు తదితరులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు వారిని
బలవంతంగా లాక్కెళ్లి రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు అడ్డుకొని నిరసన తెలిపారు.