హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావును బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. ఈ నెల 2న ఎంపీ దామోదర్‌రావు తల్లి ఆండాళమ్మ కాలం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్‌లోని దామోదర్‌రావు ఇంటికి వెళ్లిన కేసీఆర్ ఆమె చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.
దామోదర్‌రావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్‌కుమార్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తదితరులున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దామోదర్‌రావును పరామర్శించారు.