హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజకీయ కుట్రలు పన్నుతున్నారంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు సర్కార్‌పై మండిపడ్డారు.
సోమవారం తెలంగాణభవన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్, అల్లీపురం వెంకటేశ్వర్లు, కిశోర్‌గౌడ్, మన్నె గోవర్ధన్ తదితరులు
కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ రెండు రోజులపాటు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భారీ బైక్ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు.
నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని అరెస్టు చేసి ఎత్తుకెళ్తున్న పోలీసులు
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఏకపక్ష నివేదికను నిరసిస్తూ అమరవీరుల స్తూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాలకు కాళేశ్వరం జలాలతో అభిషేకం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. పెద్దసంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్లో కేసీఆర్, తన్నీరు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫ్లెక్సీకి జలాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
హనుమకొండ చౌరస్తాలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, పార్టీ శ్రేణులు