Minister KTR | రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కార్పోరేటర్లతో మంత్రి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పోరేటర్లకు కార్పొరేటర్లకు పలు అంశాలపై మంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 16న బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
పాలన వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డు కార్యాలయాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాల ఏర్పాటుతో సుపరిపాలన మరింత బలోపేతమవుతుందని తెలిపారు. కొత్త విధానాన్ని కార్పొరేట్లు విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్న ఆయన.. కార్పొరేటర్లు బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు. ఏడాది పాటు విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు.