CM KCR | వచ్చే ఏడాది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర తీరాన సమతామూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రకాశ్ అంబేద్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నిజంగా పని చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పేందుకు ఆత్మవిశ్వాసం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తానని చెప్పి వెళ్లాను.
పార్లమెంట్లో బిల్లు పాసై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు తిరిగిరావడం జరిగింది. ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు. ముఖ్యమంత్రి ఇక్కడ కార్యక్రమాలు చేశారు. జాతీయ రాజకీయాల్లో ఇదే రకమైన కార్యక్రమాలు చేసేందుకు పార్టీని జాతీయంగా విస్తరించారన్నారు. మీ అందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రికి ఉండాలని ఆయన మీకు చెప్పారు. నేను ఒక్కటే మాట చెబుతున్నారు. ఈ విషయాలు చెప్పేందుకు ఆత్మవిశ్వాసం కావాలి. తప్పకుండా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో రాబోయే రాజ్యం మనదే. ఇది మన శత్రువులకు మింగుడు పడకపోవచ్చు. కానీ, ఒక చిన్న మినుగురు చాలు అంటుకోవడానికి. ఈ మధ్య మహారాష్ట్రకు పోతే నా కలలో కూడా ఊహించని విధంగా ప్రోత్సాహం ఆదరణ వస్తది. రేపు ఉత్తరప్రదేశ్, బిహార్‌లో, బెంగాల్లో కూడా వస్తుంది’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.