హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో రాష్ట్ర పౌరసరఫరరాల సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్ సోమవారం పర్యటించారు. అక్కడి గురుద్వారాలో ఆయన ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం నాందేడ్ జిల్లాలోని వివిధపార్టీల నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్లో చేరేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు.
మహారాష్ట్రలో వెలిసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు
ఆసిఫాబాద్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవల మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూర నియోజకవర్గంలోని సొండ, లక్కడ్‌కోట్, రాజూ రా తదితర ప్రాంతాల ప్రజలు, నాయకులు ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, పార్టీ అధ్యక్షుడు కోనేరు కోనప్ప, రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావును మర్యాదపూర్వకంగా కలిసి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు.