BRS Party | హైదరాబాద్ : శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం నుంచి బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. శాసనసభ స్పీకర్ ఛాంబర్లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ సమావేశాల్లో ఎరువులపై, వరదలపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.