హైదరాబాద్: పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ మినీ ప్లీనరీ(Brs plenary )లు నిర్వహిస్తున్నది. తొలిసారి అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ ప్రతినిధుల సభలను నిర్వహిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్లీనరిలో మంత్రులు(Ministers), స్థానిక ఎమ్మెల్యే(Mla’s), ఎమ్మెల్సీ(Mlc’s), ఎంపీ(MPs)లు, మేయర్లు, చైర్మన్లు ఇతర ముఖ్య నేతలు సహా దాదాపు మూడు వేలకుపైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మె్ల్యేలు ఎన్నికల దిశగా పార్టీ శ్రేణులను ఎలా కార్యోన్ముఖులను చేయాలి, స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం(BJP) చేస్తున్న మోసం తదితర అంశాలపై చర్చించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR), సిద్దిపేట జిల్లాలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) పాల్గొని పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, వరంగల్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Minister Errabelli) తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి బీఆర్ఎస్ ప్లీనరీని ప్రారంభించారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి, వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ప్లీనరి సమావేశం వేల్పూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ ప్లీనరీకి రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి వేమలు ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy) పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధు శేఖర్,కోటపాటి నర్సింహనాయుడు తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula), మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు బీఆర్ఎస్ ప్లీనరిలో పాల్గొని మాట్లాడారు.